అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం మిల్పిటాస్లో ఉన్న షిర్డీ సాయి పరివార్(Shirdi Sai Parivaar) సంస్థ ఆధ్వర్యంలో ‘SSP గురుపూర్ణిమ వేడుకలు – ఆగస్టు 2026’ ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రత్యేకంగా హిందుస్థానీ మ్యూజిక్ మేళాను ఏర్పాటు చేశారు.
కార్యక్రమ వివరాలు:
తేదీ , సమయం: ఆగస్టు 15, 2026, శనివారం రోజున ఉదయం 9:00 గంటల నుండి ఈ వేడుకలు ప్రారంభమవుతాయి.
వేదిక (Venue): 1221 California Circle, Milpitas, CA 95035.
గ్రాండ్ ఫినాలే హిందుస్థానీ వోకల్ కాన్సర్ట్: సాయంత్రం 4:00 గంటల నుండి 6:30 గంటల వరకు ప్రముఖ కళాకారులతో సంగీత కచేరీ ఉంటుంది.
సంగీత కళాకారులు: ఈ కచేరీలో హార్మోనియంపై మనోజ్ తమ్హంకర్ (Sri Manoj Tamhankar), గాత్రం విదుషి సైలి ఓక్ (Vidushi Saili Oak), తబ్లాపై తన్మయ్ బిచు ప్రదర్శన ఇవ్వనున్నారు.
బే ఏరియాలోని హిందుస్థానీ సంగీత , నాట్య పాఠశాలలు ఈ వేడుకల్లో పాల్గొనాలని నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు. పరిమిత స్థలాలు మాత్రమే ఉండటంతో ‘మొదట వచ్చిన వారికి తొలి ప్రాధాన్యత’ అనే పద్ధతిలో ఆగస్టు 2, 2026 లోపు రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి భక్తులందరికీ సాదర స్వాగతం తెలిపారు.
