అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం పావే(Poway, CA) ప్రాంతంలో ఉన్న ప్రఖ్యాత ‘శాన్ డియాగో శివ విష్ణు ఆలయం – వేదిక్ కల్చరల్ & స్పిరిచ్యువల్ సెంటర్’ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మి అభిషేక వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. భక్తులు అందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ నిర్వాహకులు పిలుపునిచ్చారు.
కార్యక్రమ సమయం…
ప్రతి శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు ఈ పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.
సాయంత్రం 6:30 గంటలకు శ్రీ మహాలక్ష్మి అభిషేకం , లలితా సహస్రనామ పారాయణం నిర్వహిస్తారు.
దీనిని అనుసరించి అర్చన, హారతి , తీర్థ ప్రసాద వితరణ ఉంటుంది.
ప్రత్యేక విరాళం…
ఈ అభిషేక సేవలలో పాల్గొనదలచిన భక్తుల కోసం ఒక్కో సేవకు $51 విరాళం నిర్ణయించారు. భక్తులు పూజ కోసం తాజా పూలు, పండ్లు, నైవేద్యం (ఉల్లి, వెల్లుల్లి లేనిది) తమతో పాటు తీసుకురావచ్చునని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే ఆదాయం పూర్తిగా 501(సి) నాన్-ప్రాఫిట్ సంస్థ అభివృద్ధి, నిర్వహణ కొరకు ఉపయోగిస్తారు.
ఆలయ చిరునామా…
16315 Pomerado Road, Poway, CA 92064
మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు: (858) 668-9730 లేదా (858) 504-4123
