AIA: అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA) , బోల్లీ 92.3 ఎఫ్ఎం సంయుక్త ఆధ్వర్యంలో శాన్ఓస్లో ‘స్వదేశ్’ (SWADES) పేరిట భారత్ 80వ , అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. 2026 ఆగస్టు 15న శాన్ఓస్లో ప్లాజా డి సెసర్ చావెజ్ వేదికగా ఈ వేడుకలు జరుగనున్నాయి.
ప్రత్యేక ఆకర్షణలు..
ఈ కార్యక్రమానికి భారతదేశపు కాన్సుల్ జనరల్ డాక్టర్ శ్రీకర్ రెడ్డి ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ వేడుకల్లో భాగంగా భారీ బహుళజాతి పరేడ్ (Multinational Parade) 300 కోల్మన్ అవెన్యూ నుంచి 201 ఎస్ మార్కెట్ స్ట్రీట్ వరకు సాగనుంది. అలాగే డే/నైట్ మేళా, లైవ్ పెర్ఫార్మెన్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివల్, షాపింగ్ అండ్ ఎగ్జిబిషన్, కిడ్స్ జోన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రవేశం ఉచితం. ఈవెంట్ , మేళా మధ్యాహ్నం 2:00 గంటల నుండి రాత్రి 10:00 గంటల వరకు, పరేడ్ సాయంత్రం 4:00 నుండి 6:00 గంటల వరకు, జెండా ఆవిష్కరణ సాయంత్రం 6:00 గంటలకు నిర్వహించనున్నారు.
