అమెరికాలోని బే ఏరియాలో ఆదివారం (ఆగస్టు 16, 2026) జరిగిన ఎఫ్ఓజీ (FOG) ఇండియా స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్లో సిలికానాంధ్ర అత్యంత ఉత్సాహంగా పాల్గొని సత్తా చాటింది. 150 మందికి పైగా సభ్యులు త్రివర్ణ పతాకాలను చేతబూని గర్వంగా ఈ పరేడ్లో ప్రదర్శన ఇచ్చారు.
ఈ ప్రదర్శనలో అరియా యూనివర్సిటీకి చెందిన ‘మహా’ అనే గజరాజు (ఏనుగు) మాస్కాట్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. పరేడ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ శకట ప్రదర్శనకు గాను సిలికానాంధ్ర సంస్థ ‘ఉత్తమ శకటం’ (Best Float Award) పురస్కారాన్ని గెలుచుకుంది. ప్రవాస భారతీయుల సమక్షంలో భారతీయ సంస్కృతిని, గొప్పతనాన్ని చాటిచెప్పిన ఈ వేడుకల్లో సిలికానాంధ్ర సాధించిన ఈ విజయం అందరికీ గర్వకారణంగా నిలిచింది.


