సిలికానాంధ్ర(SiliconAndhra) సంస్థ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, తెలుగు భాష, సాహిత్యం, కళలు , సంస్కృతికి అంకితమైన ఈ ప్రయాణాన్ని సూచిస్తూ ‘సుజనరంజని’ (SujanaRanjani) రజతోత్సవ ప్రత్యేక సంచికను విడుదల చేసినట్లు సంస్థ తెలిపింది. ఈ ప్రత్యేక సంచికలో సిలికానాంధ్రప్రయాణాన్ని తీర్చిదిద్దిన అపురూప జ్ఞాపకాలు, స్ఫూర్తిదాయక కథలు, మరువలేని క్షణాలు, మైలురాళ్లను పొందుపరిచారు.
ఈ విశేష సంచికను అందరూ వీక్షించి, జ్ఞాపకాలను నెమరువేసుకోవడంతో పాటు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోవాల్సిందిగా సిలికానాంధ్ర ప్రెసిడెంట్ సత్యప్రియ తనుగుల (SatyaPriya Tanugula) కోరారు. గత 25 ఏళ్లుగా సంస్థకు నిరంతరం మద్దతు ఇస్తూ, ప్రోత్సహిస్తూ సిలికానాంధ్రకుటుంబంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
ప్రత్యేక సంచిక వెబ్సైట్ లింక్: https://sujanaranjani.siliconandhra.org/sasj/
సంచిక ప్రధాన అంశాలు: 25 ఏళ్ల వారసత్వం (Heritage), మధుర జ్ఞాపకాలు (Memories), అందరి కలయికతో కూడిన ప్రయాణం (Togetherness).
