చాలా కాలం తర్వాత టాలీవుడ్, కోలీవుడ్ తార త్రిష ఓ సరికొత్త సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ లండన్‌లో అధికారికంగా మొదలైంది. ఇంకా పేరు ఖరారు చేయని ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో త్రిషతో పాటు సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్, జాతీయ అవార్డు గ్రహీత అపర్ణ బాలమురళి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
‘ఎయిర్‌లిఫ్ట్’, ‘చెఫ్’, ‘పిప్పా’ వంటి ప్రత్యేకమైన బాలీవుడ్ చిత్రాలను తెరకెక్కించిన రాజా కృష్ణ మీనన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్లో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన ‘పనోరమా స్టూడియోస్’ (కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్), లోకోమోటివ్ గ్లోబల్, ఫ్యూజన్ ఫ్లిక్స్‌తో కలిసి ఈ సినిమా ద్వారా తొలిసారిగా కోలీవుడ్ (తమిళ చిత్ర పరిశ్రమ)లోకి అడుగుపెడుతోంది. ముగ్గురు పవర్ఫుల్ నటీమణుల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ హారర్ థ్రిల్లర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడికానున్నాయి.
