అమెరికాలోని గ్రేటర్ శాక్రమెంటో తెలుగు సంఘం ఆధ్వర్యంలో ‘కలిసి ఆడదాం.. కలసి గెలుద్దాం’ అనే నినాదంతో ‘స్పోర్ట్స్ ఫెస్ట్ 2026’ క్రీడా సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. క్రీడాభిమానులను, ప్రవాస తెలుగు సమాజాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు ఈ పోటీలను రెండు వేర్వేరు వారాల్లో నిర్వహించనున్నారు.
పోటీల వివరాలు ..
ఈ క్రీడా మహోత్సవంలో భాగంగా వివిధ రకాల పోటీలను కింది విధంగా నిర్వహించనున్నారు. నవంబర్ 14, 2026 శనివారం ఉదయం 9:30 గంటలకు చదరంగం, క్యారమ్స్ , చిత్రలేఖనం పోటీలు ప్రారంభమవుతాయి. ఈ పోటీలు శాక్రమెంటోలోని చిన్మయ మిషన్ వేదికగా జరుగుతాయి. నవంబర్ 21, న ఉదయం 8:00 గంటలకు టేబుల్ టెన్నిస్, పికిల్ బాల్ , త్రో బాల్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలకు ఫోల్సమ్లోని ఆండీ మోరిన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదిక కానుంది.
సంప్రదింపుల వివరాలు..
ఈ పోటీలలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు గ్రేటర్ శాక్రమెంటో తెలుగు సంఘం అధికారిక వెబ్సైట్ ద్వారా పేర్లను నమోదు చేసుకోవచ్చు. క్రీడాకారులు వాటర్ బాటిల్స్ వెంట తెచ్చుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఇతర వివరాలకు లేదా నమోదు సంబంధిత సమాచారం కోసం ఫోన్ నంబర్ లేదా ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు.
