ఫ్రీమాంట్లో నవంబర్ నెలలో పలు ఆకర్షణీయమైన సెలవుదిన వేడుకలు, కమ్యూనిటీ కార్యక్రమాలు జరగనున్నాయి. షికా కపూర్ టీమ్ (Shikha Kapur Team | COMPASS) అందించిన వివరాల ప్రకారం ఈ నెలలో నిర్వహించే ప్రధాన కార్యక్రమాలు ఇవే…
నైల్స్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ పరేడ్ & ట్రీ లైటింగ్ (నవంబర్ 27, శుక్రవారం): నైల్స్ మెయిన్ స్ట్రీట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 27న ట్రీ లైటింగ్ , పరేడ్ నిర్వహించనున్నారు.
పసిఫిక్ కామన్స్ హాలిడే సెలబ్రేషన్ & ట్రీ లైటింగ్ (నవంబర్ 29, ఆదివారం): మార్కెట్ బ్రాయిలర్ సమీపంలో సాయంత్రం 6 నుండి 8 గంటల మధ్య ఈ వేడుక జరగనుండగా, శాంటాతో ఫోటోలు దిగే అవకాశం ఉంది.
నైల్స్ కాన్సన్ రైల్వే – ట్రైన్ ఆఫ్ లైట్స్ (నవంబర్ 20 నుండి): నవంబర్ 20 నుండి డిసెంబర్ 30 వరకు వారాంతాల్లో , కొన్ని వారపు రోజుల్లో ఈ ట్రైన్ ప్రయాణిస్తుంది. నైల్స్లో సాయంత్రం 4:30కి, సునోల్లో రాత్రి 7:30కి రైళ్లు బయలుదేరుతాయి.
