కాలిఫోర్నియాలోని పామ్ స్ప్రింగ్స్‌లో ఉన్న ఐసెన్‌హోవర్ హెల్త్‌లో నూతనంగా నిర్మించిన చాండి ఎమర్జెన్సీ కేర్ డిపార్ట్మెంట్ ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. కోచీలా వ్యాలీలో ప్రజలకు మెరుగైన, అందుబాటు ధరలో నాణ్యమైన వైద్య సేవలను అందించే లక్ష్యంతో ప్రముఖ భారతీయ అమెరికన్ ప్రవాస కుటుంబమైన చాండి కుటుంబం (నచ్ఛత్తర్ చాండి నేతృత్వంలో) ఈ విభాగాన్ని విరాళంగా అందించింది. ఈ ప్రారంభోత్సవ వేడుకకు సీజీ శ్రీనివాస కేజే ముఖ్య అతిథిగా విచ్చేశారు.
భారత్-అమెరికా సంబంధాలకు ..
అమెరికాలో భారతీయ అమెరికన్లు అందిస్తున్న సేవలు, సామాజిక దృక్పథానికి ఈ వైద్య విభాగం మరో అద్దం పడుతోంది. రెండు దేశాల మధ్య దౌత్య , సాంస్కృతిక బంధాలను బలపడటంలో ప్రవాస భారతీయుల పాత్ర ఎంతో కీలకమని ఈ వేడుక మరోసారి చాటిచెప్పింది. స్థానిక సమాజానికి అత్యవసర వైద్య సేవలను మరింత చేరువ చేయడంలో ఈ విరాళం ఎంతో తోడ్పడుతుందని అధికారులు ప్రశంసించారు.
