ఫ్రీమాంట్ చాంబర్ ఆఫ్ కామర్స్ (Fremont Chamber of Commerce) ఆధ్వర్యంలో నగర మేయర్ రాజ్ సల్వాన్తో కలిసి ‘బ్రేక్‌ఫాస్ట్ విత్ ది మేయర్’ (Breakfast with the Mayor) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 2026 నవంబర్ 13, శుక్రవారం ఉదయం 8:30 AM నుండి 10:00 AM వరకు ఫ్రీమాంట్‌లోని వార్మ్ స్ప్రింగ్స్ బ్లవార్డ్లో ఉన్న హిల్టన్ గార్డెన్ ఇన్నో (Hilton Garden Inn) వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది.
స్థానిక వ్యాపార ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొని మేయర్‌తో ముచ్చటించడానికి, తమ ప్రశ్నలను అడిగేందుకు ఇది చక్కటి అవకాశం. ఈ కార్యక్రమానికి ముందస్తు రిజిస్ట్రేషన్ (RSVP) తప్పనిసరి అని, ఎంట్రీ లేకుండా నేరుగా వచ్చే వారికి అనుమతి లేదని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి కామ్‌కాస్ట్ (Comcast), హిల్టన్ గార్డెన్ ఇన్నో, కైసర్ పర్మనెంటే, రిపబ్లిక్ సర్వీసెస్, వాషింగ్టన్ హెల్త్ సంస్థలు స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి.
