కాలిఫోర్నియాలోని శాన్ డిగో హనుమాన్ ఆలయంలో పవిత్ర కార్తిక మాసాన్ని పురస్కరించుకుని ‘కార్తిక మాస శత రుద్రీయ’ (Kartika Masa Shata Rudreeya) వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. నవంబర్ 13, శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కలశ స్థాపన, మహన్యాస, షోడశోపచార పూజలతో ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.
అలాగే నవంబర్ 14, శనివారం మధ్యాహ్నం 4 గంటల నుండి 11 సార్లు రుద్ర పఠనం, 11 ద్రవ్య అభిషేకం, రుద్ర హోమం, కలశాభిషేకం, అలంకార, హారతి, మహా ప్రసాదం మరియు స్కంద షష్ఠిని పురస్కరించుకుని సుబ్రహ్మణ్య అభిషేకం నిర్వహించనున్నారు. హోమంలో పాల్గొనేవారు పంచె మరియు అంగవస్త్రం ధరించాలని నిర్వాహకులు తెలిపారు. పూర్తి వివరాలకు లేదా సేవలందించడానికి [email protected] మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.
