రాబోయే శీతాకాలంలో సంభవించే ఎల్ నిన్నో తుఫాన్ల ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వివిధ అత్యవసర సేవా సంస్థలు ఏకమయ్యాయి. కాల్ ఫైర్, రెడ్ క్రాస్, పీజీఅండ్ఈ, శాన్ హోసే అత్యవసర నిర్వహణ కార్యాలయానికి చెందిన ప్రతినిధులు మంగళవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పాల్గొని, తమ సన్నాహక చర్యలను ప్రదర్శించారు. విపత్తు సమయంలో అన్ని సంస్థల మధ్య స్పష్టమైన సమాచార మార్పిడి , పరస్పర సహకారం చాలా కీలకమని, ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని వారు స్పష్టం చేశారు.
ముందస్తు ప్రణాళికలు ..
రాబోయే రోజుల్లో వాతావరణంలో వచ్చే మార్పులను 4 నుండి 10 రోజుల ముందే అంచనా వేయడానికి పెద్ద వాతావరణ విశ్లేషణ బృందం అందుబాటులో ఉందని పీజీఅండ్ఈ వైస్ ప్రెసిడెంట్ ఆంజీ గిబ్సన్ తెలిపారు. ఇది ముందస్తుగా వనరులను సమకూర్చుకోవడానికి ఎంతో సహాయపడుతుందని పేర్కొన్నారు. గతంలో 2023లో నమోదైన తీవ్ర తుఫాన్ల సమయంతో పోలిస్తే, ప్రస్తుతం ఆధునిక సాంకేతికత ఎంతగానో మెరుగపడిందని, ఇది వేగవంతమైన సహాయక చర్యలకు తోడ్పడుతుందని అధికారులు వెల్లడించారు.
కొండచరిల విరిగిపాటు అంచనా..
ఈ శీతాకాలంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అన్ని విభాగాలు పూర్తి అప్రమత్తతతో వ్యవహరిస్తున్నాయి. అయితే సౌత్ బే ప్రాంతంలో ఈ వేసవిలో పెద్దగా కార్చిచ్చు ఘటనలు నమోదు కాకపోవడం సానుకూల అంశమని కాల్ ఫైర్ చీఫ్ మార్కస్ హెర్నాండెజ్ వెల్లడించారు. దీనివల్ల వర్షాల సమయంలో సంభవించే కొండచరియలు విరిగిపాటు ప్రమాదాలు తగ్గుతాయని ఆయన ధైర్యం వ్యక్తం చేశారు.
