మౌంటైన్ హౌస్ నగరవాసులకు , పికిల్‌బాల్ క్రీడాభిమానులకు ఒక చక్కటి శుభవార్త అందింది. స్థానికులంతా కలిసి ఆడుకోవడానికి, ఉత్సాహంగా గడపడానికి వీలుగా సిటీ ఆఫ్ మౌంటైన్ హౌస్ ఆధ్వర్యంలో సరికొత్త పికిల్‌బాల్ కోర్టులు సిద్ధమయ్యాయి. సెంట్రల్ కమ్యూనిటీ పార్క్‌లో నిర్మించిన ఈ నూతన కోర్టుల రిబ్బన్ కటింగ్ , ప్రారంభోత్సవ వేడుకను నవంబర్ 18 బుధవారం సాయంత్రం 4:30 గంటలకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
కుటుంబ సమేతంగా విచ్చేయాలని ఆహ్వానం..
అనుభవజ్ఞులైన క్రీడాకారులతో పాటు, ఇప్పుడే కొత్తగా ఆట నేర్చుకోవాలనుకునే వారు సైతం ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొనవచ్చు. కమ్యూనిటీలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కొత్త వసతిని సద్వినియోగం చేసుకోవాలని, మొదటి మ్యాచ్ కోసం తమ స్నేహితులను ఆహ్వానిస్తూ కుటుంబ సమేతంగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని నగర అధికారులు కోరారు. ఆసక్తి గలవారు ముందుగా నగర అధికారిక వెబ్సైట్ లేదా పోస్టర్‌లోని క్యూఆర్ కోడ్ ద్వారా తమ హాజరును నమోదు చేసుకోవచ్చు.
