శాన్ ఫ్రాన్సిస్కో సిటీ హాల్లో తొలిసారిగా అధికారికంగా దీపావళి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. నవంబర్ 4న జరిగిన ఈ చారిత్రాత్మక వేడుకల్లో భారతీయ కాన్సుల్ జనరల్ సతీష్ శివన్, శాన్ ఫ్రాన్సిస్కో మేయర్ డానియల్ లూరీ, నగర అధికారులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇండియాస్పోరా(Indiaspora) సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు సంస్థ వ్యవస్థాపకులు ఎం.ఆర్.రంగస్వామి హాజరయ్యారు.
వేడుకల్లో భాగంగా సంప్రదాయ దీపజ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలు భారతదేశం, అమెరికాల మధ్య ఉన్న బలమైన సాంస్కృతిక బంధాలను, శాన్ ఫ్రాన్సిస్కో అభివృద్ధిలో ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ అందిస్తున్న సేవలను ఘనంగా చాటాయి. నగర నడిబొడ్డున దీపావళి సంప్రదాయాలను తీసుకువచ్చిన ఈ చారిత్రాత్మక వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి.

