శాన్ ఫ్రాన్సిస్కో సిటీ హాల్లో మొట్టమొదటిసారిగా దీపావళి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై విజ్ఞానం సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి నిలుస్తుందని పేర్కొంటూ నగర మేయర్ ఈ వేడుకలను నిర్వహించారు. తరతరాలుగా స్థానిక చిన్న వ్యాపారాలు, పౌర జీవితం, కమ్యూనిటీ నాయకత్వం ద్వారా శాన్ ఫ్రాన్సిస్కో అభివృద్ధికి భారతీయ , దక్షిణ ఆసియా కమ్యూనిటీలు అందించిన అమూల్యమైన సహకారాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ చారిత్రాత్మక వేడుక సాధ్యం కావడానికి సహకరించిన ఎం.ఆర్. రంగస్వామి , ఆయన నాన్ఫ్రాఫిట్ సంస్థ ‘ఇండియాస్పోరా’ (Indiaspora) కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ దీపావళి పర్వదినాన మన జీవితాల్లో వెలుగులు నింపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ఇతరులకు కూడా సహాయపడే మార్గాలను అన్వేషించాలని పిలుపునిచ్చారు.
శాన్ ఫ్రాన్సిస్కోలో ఘనంగా దీపావళి వేడుకలు..
