కాలిఫోర్నియాలోని సాన్ హోసేలో ‘గివ్ థాంక్స్’ పేరిట థాంక్స్ గివింగ్ వీకెండ్ 2026 వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. 2026 నవంబర్ 25, 27 , 28 తేదీల్లో సాన్ హోసేలో కన్వెన్షన్ సెంటర్లో ఈ పండుగ వాతావరణం నెలకొననుంది.
సంగీత ప్రదర్శనల షెడ్యూల్..
మూడు రోజుల పాటు జరిగే ఈ సంగీత మహోత్సవంలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రముఖ ఆర్టిస్ట్‌లు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. నవంబర్ 25 బుధవారం రోజు జెడ్స్ డెడ్ , లెవిటీ తమ ప్రత్యక్ష సంగీతంతో అలరించనున్నారు. నవంబర్ 27 శుక్రవారం నాడు స్లాండర్ , సెవెన్ లయన్స్ ప్రదర్శనలు ప్లాన్ చేశారు.
చివరగా నవంబర్ 28 శనివారం రోజు క్య్రాంక్డేట్ బి2బి వూలీకి చెందిన వాంక్డాట్ ప్రత్యేక ప్రదర్శనతో సంగీత ప్రియులను అలరించనున్నారు.
ప్రత్యేక ఆకర్షణలు ..
ఈ ఉత్సవంలో ప్రత్యక్ష సంగీతంతో పాటు రకరకాల రుచులను అందించే ఫుడ్ ట్రక్కులు , పండుగ వాతావరణం ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ ఈవెంట్ 150 డబ్ల్యూ శాన్ కార్లోస్ స్ట్రీట్‌లోని సాన్ హోసే కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది.
ఇది ఒక టికెట్ ఆధారిత కార్యక్రమం. ఆసక్తి ఉన్నవారు మరింత సమాచారం , టికెట్ల బుకింగ్ కోసం గివ్థాంక్స్ ఫెస్టివల్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని నిర్వాహకులు తెలిపారు.
