బే ఏరియాలో అసోసియేషన్ ఆఫ్ ఇండో-అమెరికన్స్ (AIA) ఆధ్వర్యంలో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సీ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఇండిపెండెన్స్ డే ఫ్లోట్లో ఆమె గర్వంగా పాల్గొని భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను అంతర్జాతీయ వేదికపై చాటిచెప్పారు.
ఈ వేడుకలకు ప్రముఖ సినీ నటి తాప్సీ పన్ను ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరితో పాటు భారత కాన్సుల్ జనరల్ శ్రీ శ్రీకర్ రెడ్డి, స్థానిక నగర మేయర్, వైస్ మేయర్‌తో పాటు పలువురు ప్రముఖ నగర అధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. భారతదేశం గొప్ప సాంస్కృతిక వైవిధ్యం, ఐక్యత , దేశభక్తి భావాలను ప్రతిబింబించేలా ఈ ఉత్సవాలు అట్టహాసంగా సాగాయి. అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు, ముఖ్యంగా తెలంగాణ వాసులు పెద్ద సంఖ్యలో హాజరై స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ప్రదర్శించిన ఫ్లోట్ ఈ వేడుకలన్నింటిలోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరి ప్రశంసలను అందుకుంది.

