సమాజంలోని నిరుపేదలకు సాయం చేసే లక్ష్యంతో పనిచేస్తున్న ‘ఫిజి కమ్యూనిటీ ఆఫ్ కాలిఫోర్నియా’ (Fiji Community of California) నాన్ఫ్రాఫిట్ సంస్థ ఆధ్వర్యంలో పలావ్ ఫండ్రైజర్ (Palau Fundraiser) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నవంబర్ 14, 2026 రోజున ఉదయం 11:00 AM నుండి సాయంత్రం 4:00 AM వరకు ఫ్రీమాంట్లోని 36212 San Pedro Dr., Fremont, CA 94536 వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది.
ఈ ఫండ్రైజర్లో భాగంగా ప్రత్యేకంగా హలాల్ (Halal) పద్ధతిలో తయారుచేసిన మటన్/చికెన్ పలావ్ (సలాడ్తో కలిపి 1/2 ట్రే $50) , వెజ్ పలావ్ (సలాడ్తో కలిపి 1/2 ట్రే $40) అందుబాటులో ఉంచారు. ప్రతి ట్రే 4 నుండి 5 మందికి సరిపోతుందని, అభ్యర్థిస్తే సింగిల్ సర్వింగ్ కూడా అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుక ద్వారా వచ్చే విరాళాలను ఫిజిలోని ట్రెజర్ ఆర్ఫనేజ్ హోమ్ – నాడి , హార్ట్ వలేలేవు సంస్థల సహాయార్థం వినియోగిస్తారు. ఈ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం నితిన్ (5103711198), విశాల్ (5105572278), సామ్ (5102070981) లేదా బిమ్లేష్ (6507934256) నంబర్లను సంప్రదించవచ్చు.
