మౌంటైన్ వ్యూ నగర పాలక సంస్థ, ఛారిటీస్ హౌసింగ్, శాంటా క్లారా కౌంటీ, శాంటా క్లారా కౌంటీ హౌసింగ్ అథారిటీ , ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వాములతో కలిసి ‘మోంటెసిటో మల్టీఫ్యామిలీ’ (Montecito Multifamily) అఫర్డబుల్ హౌసింగ్ గ్రాండ్ ఓపెనింగ్‌ను ఘనంగా నిర్వహించారు.
1265 మోంటెసిటో ఏవెన్యూలో నిర్మించిన ఈ కొత్త ప్రాజెక్ట్ ద్వారా 85 అఫర్డబుల్ అపార్ట్మెంట్లతో కూడిన హౌసింగ్ కమ్యూనిటీ అందుబాటులోకి వచ్చింది. ప్రాంతీయంగా అతి తక్కువ ఆదాయం కలిగిన నివాసితుల గృహావసరాలను తీర్చడానికి, ఏరియా మీడియన్ ఇన్కమ్ (AMI) లో 30% నుండి 50% వరకు ఆర్జించే కుటుంబాలకు ఈ ఇళ్లు కేటాయించబడతాయి. ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం నగర పాలక సంస్థ రూ. 13.5 మిలియన్లను కేటాయించింది.
