మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (X) ద్వారా చిత్రయూనిట్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
సినిమా విజయంపై చిరంజీవి స్పందిస్తూ.. రవితేజ నటన , దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన భావోద్వేగాలు (ఎమోషన్స్) చాలా అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. అలాగే ఈ చిత్రంలో నటించిన బాలనటి నక్షత్ర అభినయాన్ని ప్రత్యేకంగా మెచ్చుకుంటూ ఆమెను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా “ఒక సినిమా విజయం పరిశ్రమలోని అందరికీ పండుగే. ఈ పరిశ్రమ అందరిదీ, ఏ కొందరిదో కాదు. మనం బతకాలి, ఇతరులనూ బతికించాలి” అంటూ చిరు రాసుకొచ్చిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిత్రబృందంపై మెగాస్టార్ చూపించిన ఆప్యాయత టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.
