అక్ఇష్రరటుడే వెబ్న్డెస్క్: అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధాన్ని ఎప్పుడు ముగించాలనే విషయాన్ని నిర్ణయించాల్సింది అమెరికానేనని స్పష్టం చేశారు. తమ దేశం ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోవడం లేదని, అయితే అగ్రరాజ్యాల ఒత్తిళ్లకు టెహ్రాన్ తలవంచబోదని తేల్చిచెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి యుద్ధం ముగుస్తుందా అన్న మీడియా ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పెజెష్కియాన్ హెచ్చరికలు..
యుద్ధాన్ని ఎలా ముగించాలనే అంశంపై ఇరుపక్షాల మధ్య ఇంకా స్పష్టమైన ఏకాభిప్రాయం కుదరలేదని పెజెష్కియాన్ తెలిపారు. ఇరాన్లో నెలకొన్న ఆర్థిక ఇబ్బందులను అడ్డంపెట్టుకుని అమెరికా, ఇజ్రాయెల్, యూరప్ దేశాల నేతలు కావాలనే అశాంతి వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ సంఘర్షణల వల్ల ఇరాన్‌కు గానీ, అమెరికాకు గానీ ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన స్పష్టం చేశారు.
సౌదీ అరేబియాపై హూతీల ఉగ్ర దాడి..
పశ్చిమాసియాలో ఒకవైపు అమెరికా-ఇరాన్ ఘర్షణలు కొనసాగుతుండగా, మరోవైపు యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై దాడులను తీవ్రం చేశారు. తాజాగా సౌదీలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాల్లో ఒకటైన ‘అరామ్కో’ (Saudi Aramco) రిఫైనరీని లక్ష్యంగా చేసుకుని హూతీలు డ్రోన్లు, క్షిపణులతో దాడి చేశారు. రాస్ తనురాలోని ఈ రిఫైనరీ మౌలిక సదుపాయాలపై జరిగిన ఈ దాడుల్లో ప్రాణనష్టం సంభవించినట్లు హూతీ సైనిక ప్రతినిధి వెల్లడించారు.
క్షేపిణులను అడ్డుకున్న సౌదీ బలగాలు..
దక్షిణ తైఫ్ ప్రావిన్స్, ఎర్ర సముద్ర తీరంలోని యాన్బు ప్రాంతాల వైపు దూసుకొచ్చిన ఆరు బాలిస్టిక్ క్షిపణులను సౌదీ అరేబియా రక్షణ బలగాలు విజయవంతంగా అడ్డుకున్నాయి. ఈ దాడుల తీవ్రత దృష్ట్యా పవిత్ర మక్కా నగరంతో పాటు పలు కీలక ప్రాంతాలకు సౌదీ ప్రభుత్వం అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది.
