అక్కినేని నాగచైతన్య హీరోగా, కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైథలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ ‘వృషకర్మ’. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సస్పెన్స్ ఎలిమెంట్స్ హైలైట్గా నిలవనున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల తేదీపై తాజాగా దర్శకుడు కార్తీక్ దండు స్పష్టతనిచ్చారు.
ఓ ప్రాంతంలో అభిమానులతో ముచ్చటించిన సందర్భంగా ఆయన సినిమా రిలీజ్ గురించి మాట్లాడారు. సినిమాలో గ్రాఫిక్స్ పనులు చాలా కీలకమని, విజువల్ ఎఫెక్ట్స్ (GFX) చక్కగా వస్తేనే సినిమాకు మంచి పేరు వస్తుందని తెలిపారు. గ్రాఫిక్స్ అవుట్పుట్ ఆధారంగానే రిలీజ్ డేట్ ఉంటుందని, అన్నీ అనుకున్నట్లుగా కుదిరితే 90 శాతం దసరాకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తామని కార్తీక్ దండు వెల్లడించారు.
