మాస్ మహారాజా లేటెస్ట్ మూవీ ఇరుముడి, సూర్య హీరోగా నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రంపై పడింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ సూపర్‌స్టార్ సూర్య, మమితా బైజు జంటగా నటించిన చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా కలెక్షన్లు ఇలా ఉన్నాయి.
బడ్జెట్ , బ్రేక్ ఈవెన్ టార్గెట్:
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ , పబ్లిసిటీ ఖర్చులతో కలిపి ఈ సినిమాను సుమారు 130 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు.
ఈ చిత్రానికి వరల్డ్ వైడ్‌గా 90 కోట్ల రూపాయలకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరగగా, లాభాల్లోకి రావాలంటే 92 కోట్ల రూపాయల షేర్ , 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు అంచనా వేశారు.
మొదటి వారం కలెక్షన్స్:
మొదటి 7 రోజుల్లో ఈ సినిమా ఇండియాలో 81.60 కోట్ల రూపాయల నెట్, 94.32 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో 38.40 కోట్లు, తమిళనాడులో 36.85 కోట్లు, కర్ణాటకలో 10.83 కోట్లు, కేరళలో 6.75 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో 1.49 కోట్ల రూపాయలను ఈ చిత్రం రాబట్టింది.
ఓవర్సీస్ మార్కెట్లో అమెరికాలో 2 మిలియన్ డాలర్లు (రూ. 19.14 కోట్లు), ఇతర దేశాలతో కలిపి మొత్తం 7 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 143 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. అయితే తమ చిత్రం 4 రోజుల్లోనే 150 కోట్ల మార్క్ దాటిందని మేకర్స్ ప్రకటించారు.
8వ రోజు బాక్సాఫీస్ వద్ద ఎదురుదెబ్బ:
గడిచిన వారం రోజులుగా చక్కటి వసూళ్లు రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు రెండో వారం ప్రారంభంలో గట్టి పోటీ ఎదురైంది. మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమా పాజిటివ్ టాక్‌తో విడుదల కావడంతో సూర్య మూవీకి బుకింగ్స్ ఒక్కసారిగా పడిపోయాయి. ప్రధానంగా తెలుగు మార్కెట్ ఈ సినిమాకు బలమైనా, శుక్రవారం నాడు ‘ఇరుముడి’ ఎఫెక్ట్ గట్టిగానే పడింది. 8వ రోజు సాయంత్రం 5 గంటల వరకు ఇండియాలో కేవలం 1.51 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేయగా, వరల్డ్ వైడ్‌గా ఈ రోజు సుమారు 5 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
