సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ సీక్వెల్ ‘జైలర్ 2’కు సంబంధించి ఆసక్తికరమైన సమాచారం వెలువడింది. తమిళనాడు రాజకీయ పరిస్థితులు, సామాజిక వాతావరణం నేపథ్యంలో ఏ వర్గానికి ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు మేకర్స్ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
సినిమా రన్‌కు లేదా రజనీకాంత్ ప్రతిష్టకు ఎలాంటి అడ్డంకులు రాకూడదనే ఉద్దేశంతో సున్నితమైన రాజకీయ అంశాలతో కూడిన కొన్ని సన్నివేశాలను తొలగించి రీషూట్ చేయాలని నిర్ణయించినట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వివాదాస్పద అంశాల జోలికి వెళ్లకుండా, పూర్తిగా పక్కా యాక్షన్ , కమర్షియల్ ఎంటర్టైన్మెంట్కే పెద్దపీట వేసేలా స్క్రిప్ట్‌లో ఈ మార్పులు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రజనీకాంత్ తన ఇతర ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నప్పటికీ, ఈ రీషూట్లు , చిత్రానికి సంబంధించిన పనులపై త్వరలోనే పూర్తి స్పష్టత రానుంది.
