నటసింహం నందమూరి బాలకృష్ణ(nandamuri Balakrishna), డైరెక్టర్ కొరటాల శివ(Koratala siva) కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ప్రస్తుతం దాదా షూటింగ్ లో బిజీగా ఉన్న బాలయ్య(Balayya), ఆ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిన వెంటనే కొరటాల సినిమాకు రెడీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరూ మాస్ ఇమేజ్ ఉన్న వ్యక్తులు కలిస్తే సిల్వర్ స్క్రీన్ పై ఎలాంటి మ్యాజిక్ జరుగుతుందనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది. ముఖ్యంగా బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా కొరటాల ఎలాంటి స్టోరీని రెడీ చేశారన్నది ఆసక్తికరంగా మారింది.
తన సినిమాల్లో సామాజిక అంశాలను కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మేళవించడం కొరటాల స్పెషాలిటీ. మిర్చి(Mirchi), శ్రీమంతుడు(Srimanthudu), జనతా గ్యారేజ్(Janatha Garage), భరత్ అనే నేను(Bharath ane nenu), దేవర(Devara) సినిమాల్లో హీరో క్యారెక్టర్లను విభిన్నంగా ఆవిష్కరించారు. ప్రశాంతంగా కనిపించే క్యారెక్టర్ ను అవసరమైన సందర్భంలో పవర్ఫుల్ మాస్ క్యారెక్టర్‌గా మార్చడంలో ఆయనకు మంచి పట్టుంది. ఈ నేపథ్యంలో బాలయ్య ఎనర్జీ, డైలాగ్ డెలివరీ, ఫ్యాన్స్ కోరుకునే యాక్షన్ అంశాలకు ప్రాధాన్యమిస్తూనే బలమైన కథాంశాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. క్లాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే ఎమోషన్స్, మాస్ ప్రేక్షకులను అలరించే సీన్స్ తో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి.
గతంలో బాలకృష్ణ కోసం కొరటాల ఓ పవర్ఫుల్ స్టోరీని రెడీ చేశారనే ప్రచారం కూడా ఉంది. అయితే అప్పట్లో కొన్ని కారణాలతో ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదని టాక్. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ సాధ్యమవుతుండటంతో ఆ కథకు మళ్లీ ప్రాణం పోస్తారా? లేక పూర్తిగా కొత్త కథతో ముందుకొస్తారా? అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. మరోవైపు పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని కథను రూపొందించే అవకాశాలూ ఉన్నాయి. ఆచార్య(Aacharya) రిజల్ట్ తర్వాత స్ట్రాంగ్ సక్సెస్ ను అందుకోవాలని చూస్తున్న కొరటాలకు దేవర ఒకింత ఊరటనిచ్చినప్పటికీ బాలయ్య సినిమా అతనికి కీలకం కానుంది.
