యంగ్ హీరో అనీష్(Aniesh) హీరోగా పరిచయమవుతున్న సినిమా ఇట్లు అర్జున(Itlu Arjuna). అనీష్, అనస్వర రాజన్(Anaswara Rajan) జంటగా నటిస్తున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్‌లో గ్రాండ్ మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించారు. పలువురు సినీ ప్రముఖులు హాజరైన ఈ ఈవెంట్ లో హీరోహీరోయిన్లు తమ డ్యాన్స్, మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ లతో సందడి చేశారు. చీఫ్ గెస్ట్ గా పాల్గొన్న అక్కినేని అఖిల్(Akkineni Akhil).. సినిమా గురించి, మేకర్స్ చేసిన కృషి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటికే సినిమాను చూసిన ఆయన, ఆడియన్స్ కు థియేటర్లలో మంచి ఎంటర్టైన్మెంట్ ను అందించే సత్తా ఈ సినిమాకి ఉందని అభిప్రాయపడ్డారు.
డైరెక్టర్ మహేష్ ఉప్పాల(Mahesh Uppala) ఎంచుకున్న కథాంశాన్ని అఖిల్ ప్రత్యేకంగా అభినందించారు. నేటి ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా కొత్తదనంతో పాటు కమర్షియల్ అంశాలను మేళవించడం మంచి ప్రయత్నమని పేర్కొన్నారు. ముఖ్యంగా అనస్వర రాజన్(Anaswara Rajan) యాక్టింగ్, అనీష్‌తో ఆమె కెమిస్ట్రీ ఆకట్టుకున్నాయని ప్రశంసించారు. సినిమాలోని సాంగ్స్, మ్యూజిక్ కూడా థియేటర్లలో ఆడియన్స్ కు మంచి అనుభూతిని ఇస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే అఖిల్ స్పీచ్ లో అందరినీ ఆకట్టుకున్న అంశం అనీష్‌పై ఆయన చేసిన కామెంట్స్. పదేళ్ల క్రితం తాను హీరోగా అడుగుపెట్టిన టైమ్ లో అనీష్లా ఉండాలని కోరుకునేవాడినని అన్నారు. సినిమా బాధ్యతను భుజాన వేసుకుని, నిర్మాణ వ్యవహారాలను కూడా చూసుకుంటూ ఆరు నెలలుగా అతడు పడిన కష్టం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. అనీష్‌ను చూస్తే అతడి తండ్రికి ఎంత గర్వంగా ఉంటుందో అర్థమవుతోందని ఎమోషనల్ గా చెప్పారు. అఖిల్ అందించిన ప్రోత్సాహానికి అనీష్ థాంక్స్ చెప్తూ, తనను సొంత సోదరుడిలా ఆదరించారని పేర్కొన్నారు.
