సాక్రమెంటో ఇండియన్ అసోసియేషన్ (IAS) ఆధ్వర్యంలో భారతీయ సంస్కృతి, సంగీతం , నృత్య వేడుకలను ప్రతిబింబించేలా ‘రిథమ్స్ ఆఫ్ ఇండియా’ (Rhythms of India) కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 2026 డిసెంబర్ 12, శనివారం మధ్యాహ్నం 3:00 PM నుండి 5:00 PM వరకు రాంచో కార్డోవాలోని కేపీ ఇంటర్నేషనల్ మార్కెట్ (KP International Market, 10971 Olson Dr, Rancho Cordova, CA 95670) వేదికగా ఈ వేడుకలు జరగనున్నాయి.
అందమైన సాంప్రదాయ భారతీయ శాస్త్రీయ నృత్యాలు, రంగుల జానపద ప్రదర్శనలు , ఉత్సాహభరితమైన బాలీవుడ్-స్టైల్ నృత్యాల ద్వారా భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ఆస్వాదించవచ్చు. కుటుంబ సభ్యులు , స్నేహితులతో కలిసి ఈ అద్భుతమైన సాంస్కృతిక వేడుకలో పాల్గొని వైవిధ్యాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని నిర్వాహకులు ఆహ్వానించారు.
