శాన్ హోసేలోని రాధా కృష్ణ టెంపుల్ ఆఫ్ బే ఏరియా (Radha Krishna Temple of Bay Area) ఆధ్వర్యంలో శ్రీకృష్ణుని దివ్య గోవర్ధన్ లీల వేడుకను పురస్కరించుకుని ప్రత్యేక సండే సత్సంగ్ సందర్భంగా ‘గోవర్ధన్ పూజ & అన్నకూట్ మహోత్సవ్’ను నిర్వహించనున్నారు. నవంబర్ 15, 2026, ఆదివారం ఉదయం 11:00 AM నుండి మధ్యాహ్నం 1:00 PM వరకు శాన్ హోసేలోని 4411 Hyland Ave, San Jose, CA 95127 వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది.
శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలుపై ఎత్తి భక్తి, విశ్వాసాల శక్తిని లోకానికి చాటిన ఈ లీల జ్ఞాపకార్థంగా కీర్తనలు, సత్సంగ్, గోవర్ధన్ పూజ, గ్రాండ్ అన్నకూట్ భోగ్ సమర్పణ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తులు తమ ఇంట్లో తయారుచేసిన భోగ్ నైవేద్యాలను శ్రీకృష్ణునికి సమర్పించడానికి తీసుకురావాల్సిందిగా నిర్వాహకులు కోరారు. ఈ వేడుకలో గోవర్ధన్ పూజ, ఆత్మను కదిలించే కీర్తనలు, అన్నకూట్ ఆఫరింగ్, హారతి , మహాప్రసాద వితరణ ఉంటాయి. పూర్తి వివరాలకు rktbayarea.org వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా 669-200-9358 నంబర్‌ను సంప్రదించవచ్చు.
