దర్శకుడు ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ (PVCU)ను విస్తరిస్తూ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మహాకాళి’. భారతీయ తెరపై వస్తున్న తొలి ఫీమేల్ సూపర్ హీరో చిత్రంగా ఇది రూపుదిద్దుకుంటోంది. కాళీదేవి స్ఫూర్తితో స్త్రీ శక్తి ప్రాధాన్యతను చాటేలా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. “అంతం మొదలుకాబోతోంది” అనే క్యాప్షన్‌తో ఆగస్ట్ 24న ఈ చిత్రానికి సంబంధించిన మాస్ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ సినిమాలో భూమి శెట్టి, రోహిత్ సరాఫ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా అసురుల గురువైన ‘శుక్రాచార్యుడు’ పాత్రలో సరికొత్త గెటప్‌లో కనిపించనున్నారు. పూజా అపర్ణ కొల్లు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ప్రశాంత్ వర్మ కథను అందిస్తున్నారు. ఆర్కేడీ స్టూడియోస్ పతాకంపై రియాజ్ రమేష్ దుగ్గల్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
