మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోయంబత్తూరులోని గంగా ఆసుపత్రిలో మణికట్టు సర్జరీ చేయించుకోనున్నారు. ‘పెద్ది’ సినిమా షూటింగ్ సమయంలో ఆయన మణికట్టుకు గాయం అయినప్పటికీ, సినిమా ప్రమోషన్స్ పూర్తి చేసిన తర్వాత చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు.
కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్లో జరగనున్న ఈ సర్జరీ నేపథ్యంలో మెగా కుటుంబం కోయంబత్తూరుకు బయలుదేరుతోంది. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, ఉపాసనతో పాటు కుటుంబ సభ్యులు రామ్ చరణ్‌కు తోడుగా ఉండనున్నారు.
ప్రముఖ డాక్టర్ ప్రవీణ్, సీనియర్ ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ రాజశేఖర్ పర్యవేక్షణలో ఈ శస్త్రచికిత్స నిర్వహించనున్నారు. అత్యాధునిక ఆర్థోపెడిక్ చికిత్సలకు పేరుగాంచిన గంగా హాస్పిటల్‌లోని అనుభవజ్ఞులైన వైద్య బృందం ఈ సర్జరీ చేయనుంది. ఆపరేషన్ విజయవంతంగా పూర్తై, రామ్ చరణ్ త్వరగా కోలుకుంటారని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రార్థిస్తున్నారు.
