భారతరత్న, దిగ్గజ గాయని ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా ఒక భారీ పాన్ ఇండియా బయోపిక్ తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక వివరాలను చిత్రబృందం తాజాగా వెల్లడించింది. కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్నట్టుగానే ఈ చిత్రంలో ప్రధాన పాత్ర కోసం నేషనల్ క్రష్ రష్మిక మందన్నను ఖరారు చేశారు.
ప్రముఖ సాంకేతిక నిపుణులు, నిర్మాతలు..
దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి ఈ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నారు.
నిర్మాతలు: అల్లు అరవింద్, రాక్‌లైన్ వెంకటేశ్, బన్నీవాస్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సంగీతం: టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
చెన్నైలో ఘనంగా లాంచింగ్..
ఎం.ఎస్. సుబ్బులక్ష్మి 110వ జయంతిని పురస్కరించుకుని.. నేడు చెన్నైలో ఉలగనాయగన్ కమల్ హాసన్ చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
