యూవ నటుడు ఎన్టీఆర్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ చిత్రం ‘డ్రాగన్’. ఈ సినిమాను 2027 జూన్ 11న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అయితే, ఇటీవల ఎన్టీఆర్ భుజానికి గాయం కావడంతో షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్ పడింది. దీనివల్ల శ్రీలంకలో జరగాల్సిన కీలక షెడ్యూల్, సాంగ్ షూటింగ్ ఆగిపోవడంతో పాటు ప్రచారం జరుగుతున్నట్లు సమాచారం.
షూటింగ్ వేగం , విడుదల తేదీపై చర్చ..
షూటింగ్ ఆలస్యం కావడం వల్ల సినిమా విడుదల తేదీ మారుతుందనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. జూన్ నాటికి విడుదల కష్టమైతే దసరా వరకు వెళ్లొచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే, నిర్మాత రవిశంకర్ ఇటీవల మాట్లాడుతూ.. త్వరలోనే షూటింగ్ మళ్లీ ప్రారంభమై, ఫిబ్రవరి నాటికి మొత్తం పూర్తి చేసి జూన్‌లోనే సినిమాను థియేటర్లోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. పెద్ద యాక్షన్ సినిమా కావడంతో పాటు గ్రాఫిక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. రానున్న నాలుగైదు నెలల్లో ఎన్టీఆర్ షూటింగ్లో పాల్గొనే తీరు , ప్రశాంత్ నీల్ టార్గెట్‌ను బట్టే సినిమా విడుదల ఆధారపడి ఉంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక మార్పు ప్రకటించనందున, ప్రస్తుతానికి జూన్ 11 డేట్టే ఫిక్స్డ్ గా ఉంది.
