కాలిఫోర్నియా శాన్ హోసే నగరంలో దీపావళి పండుగను పురస్కరించుకుని ‘దివాళీ కార్నివాల్ అండర్ ది STARS’ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రవాస భారతీయులు, కుటుంబ సమేతంగా పాల్గొనేలా ఉచిత ప్రవేశంతో ఈ గ్రాండ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
‘కాంతార’ ఫేమ్ అబ్బీ వి లైవ్ కాన్సర్ట్..
ఈ వేడుకల్లో ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు ‘కాంతార’ ఫేమ్ అబ్బీ వి లైవ్ ఇన్ కాన్సర్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. బాలీవుడ్ బీట్స్, ప్రత్యక్ష సంగీతం, సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు , ఫ్యాషన్ షోలతో ఈ వేడుక ముచ్చటగా సాగనుంది.
వేడుకల్లో ప్రత్యేక వినోదాలు..
చిన్నారుల కోసం ప్రత్యేక కిడ్స్ జోన్, ఉచిత హెన్నా టాటూలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మొదటి 2,000 మంది సందర్శకులకు ఉచితంగా గ్లోస్టిక్స్ అందజేయనున్నారు.
షాపింగ్ & ఆహార ప్రియుల కోసం: దుస్తులు, జ్యువెలరీ స్టాళ్లు, చాట్, దోసలు, బిర్యానీ, చాయ్ బార్, డెజర్ట్ జోన్ , ప్రత్యక్ష జిలేబీ స్టేషన్లు అందుబాటులో ఉండనున్నాయి.
వేదిక వివరాలు..
తేదీ & సమయం: అక్టోబర్ 24, 2026 (శనివారం), మధ్యాహ్నం 2:00 గంటల నుండి రాత్రి 10:00 గంటల వరకు
వేదిక: ప్లాజా డి సెసార్ చావెజ్, డౌన్‌టౌన్ సాన్ హోసే (Plaza de Cesar Chavez, Downtown San Jose)
ప్రవేశం: ఉచితం (ఫ్లైయర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఉచిత టిక్కెట్లు పొందవచ్చు)
సంప్రదించాల్సిన నంబర్లు: (510) 421-3535 | (408) 499-6530 | (650) 776-1203
ఈ భారీ దీపావళి వేడుకకు ఏఐఏ (AIA), బొల్లి 92.3 ఎఫ్ఎమ్, శాన్ హోసే డౌన్‌టౌన్ అసోసియేషన్, సిటీ ఆఫ్ సాన్ హోసే, మేయర్ మ్యాట్ మహాన్ , ఎన్బిసి బే ఏరియా సహకారం అందిస్తున్నాయి. పండుగ వాతావరణంలో సాంప్రదాయ దుస్తుల్లో కుటుంబ సమేతంగా వచ్చి వేడుకల్లో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.
