ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ ఈ నెల 29న స్థానిక మ్యాడిసన్ స్క్వేర్ వద్ద నిర్వహించనున్ను ర్యాలీకి తన మద్దతు లేదని న్యూయార్క్ నగరం మేయర్ జోహ్రాన్ ముమ్మానీ స్పందిస్తూ పేర్కొన్నారు. అయితే అది ఒక ప్రైవేటు కార్యక్రమమని, దాన్ని రద్దు చేసే అధికారం తనకు లేకపోయి ఉండొచ్చు అని ఆయన వ్యాఖ్యానించారు. న్యూయార్క్లో విలేకరుల సమావేశంలో ఆయన ఈ అంశంపై మాట్లాడారు.
ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని గ్లోబల్ ఔట్రీచ్ ప్రోగ్రామ్లో భాగంగా భాగవత్ మంగళవారం అమెరికా చేరుకున్నారు. మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్ (ఎంఎస్జీ) వద్ద దాదాపు ఐదు వేల మంది భారత సంతతి వ్యక్తులను ఉద్దేశించి ఆయన శనివారం ప్రసంగించనున్నారు.
