అమెరికా, చైనా దేశాల మధ్య అంతర్జాతీయంగా ఎప్పుడూ ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంటుంది. అయితే తాజాగా ఆ రెండు దేశాల మధ్య ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అమెరికాలో పర్యటించగా, ఆయనకు అగ్రరాజ్యం ఘనంగా రెడ్‌కార్పెట్ స్వాగతం పలికింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా స్వయంగా బేస్ ఆండ్రూస్‌కు వెళ్లి జిన్‌పింగ్ దంపతులకు సాదర స్వాగతం పలకడం విశేషం.
వెలుగులోకి రహస్య నివేదిక..
ఒకవైపు అమెరికాలో జిన్‌పింగ్‌కు ఘన స్వాగతం లభిస్తున్న తరుణంలోనే, చైనా-ఇరాన్ సంబంధాలపై ప్రముఖ పత్రిక ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ (డబ్ల్యూఎస్‌జే) ఒక సంచలన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్‌ను వెలువరించింది. అమెరికా చైనా తెరవెనుక ఇరాన్ రక్షణ సంస్థలకు రహస్యంగా సహాయం అందిస్తోందని ఈ నివేదిక తేల్చింది.
ట్రేడ్ డేటా విశ్లేషణ..
అమెరికా-ఇరాన్ మధ్య జూన్ నెలలో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన రోజే ఒక చైనా కార్గో విమానం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు చేరుకుంది. ఆ విమానంలో ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సంస్థలకు అవసరమైన ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఇందులో ప్రధానంగా కొన్ని డ్రోన్ వ్యవస్థలు, క్షిపణుల నావిగేషన్‌కు ఉపయోగపడే కీలక భాగాలు ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ఈ ఏడాది జూన్ వరకు చైనా నుంచి ఇరాన్ డిఫెన్స్ సంస్థలకు సుమారు 1,300 డ్యూయెల్ యూజ్ షిప్మెంట్లు వెళ్లినట్లు ట్రేడ్ డేటా స్పష్టం చేస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన రెండు రోజుల్లోనే మరో డజనుకుపైగా సరుకులు ఇరాన్ చేరగా, వాటి విలువ సుమారు 6 మిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాల నడుమ జరిగిన జిన్‌పింగ్ అమెరికా పర్యటన అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
