కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో ఉన్న ప్రసిద్ధ హనుమాన్ ఆలయంలో కార్తిక మాస వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ పవిత్ర మాసం సందర్భంగా ఆలయంలో చేపట్టనున్న వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల షెడ్యూల్‌ను నిర్వాహకులు ప్రకటించారు. భక్తులందరూ ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆహ్వానం పలికారు.
కార్తిక సోమవార రుద్రాభిషేకాలు ..
కార్తిక మాసం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. నవంబర్ 16, నవంబర్ 23, నవంబర్ 30 , డిసెంబర్ 7 తేదీలలో రుద్రాభిషేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే నవంబర్ 14 శనివారం సాయంత్రం 4:00 గంటలకు కార్తిక మాస శతరుద్రీయ అభిషేకం అత్యంత వైభవంగా జరగనుంది.
సత్యనారాయణ వ్రతం..
ఈ మాసంలో వచ్చే పవిత్రమైన పర్వదినాలను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేపట్టనున్నారు. నవంబర్ 21 శనివారం నాడు తులసి వివాహంతో పాటు శని భగవాన్ అభిషేకం నిర్వహిస్తారు. అలాగే నవంబర్ 23 సోమవారం సాయంత్రం 6:00 గంటలకు కార్తిక పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రత పూజ ఉంటుంది.
మూల విగ్రహ అభిషేకం..
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా డిసెంబర్ 5 శనివారం రోజు ప్రదోష పూజతో పాటు హనుమాన్ మూల విగ్రహానికి , నర్మదేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకం జరుగుతుంది. అంతేకాకుండా, నవంబర్ 14 శనివారం రోజున స్కంద షష్టి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం కూడా ప్రత్యేక ఈవెంట్‌గా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
