లాస్ ఏంజెల్స్ పరిధిలోని టోరెన్స్‌లో ఉన్న శ్రీ పంచముఖ హనుమాన్ ఆలయంలో కార్తిక మాస సంబరాలు అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. నవంబర్ 9వ తేదీ సోమవారం నుంచి డిసెంబర్ 8వ తేదీ మంగళవారం వరకు నెల రోజుల పాటు ఈ ఆధ్యాత్మిక వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో రోజువారీ పూజలతో పాటు ప్రత్యేక శైవ, వైష్ణవ పూజా కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు.
ప్రత్యేక ఉత్సవాలు..
కార్తిక మాసంలో ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటలకు రుద్రాభిషేకం నిర్వహిస్తారు. ప్రతి సోమవారం ప్రత్యేక రుద్రాభిషేకం ఉంటుంది. అలాగే భక్తుల ఇళ్లలోనే స్ఫటిక శివలింగానికి వైదిక పద్ధతిలో రుద్రాభిషేకం జరిపే వెసులుబాటును ఆలయ యాజమాన్యం కల్పిస్తోంది.
ఆలయంలో జరిగే ఇతర ప్రధాన పూజా కార్యక్రమాల వివరాలు..
నవంబర్ 15 (ఆదివారం): శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా సాయంత్రం 4:30 నుండి రాత్రి 8:00 వరకు శూర సంహారం, అభిషేకం , వేడుకలు.
నవంబర్ 23 (సోమవారం): ఉదయం 10:00 గంటలకు , సాయంత్రం 6:00 గంటలకు సమూహిక సత్యనారాయణ వ్రతం.
డిసెంబర్ 7 (సోమవారం): సాయంత్రం 5:00 గంటలకు 1,001 మట్టి శివలింగాలతో సహస్ర శివలింగార్చన , మహాన్యాస పూజ.
డిసెంబర్ 8 (మంగళవారం): అమవాస్య ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 3:00 వరకు శ్రీ సుందరకాండ పారాయణం, సాయంత్రం 6:30 గంటలకు హనుమాన్ అభిషేకం, సాయంత్రం 7:00 గంటలకు రుద్రాభిషేకం.
స్పాన్సర్షిప్ వివరాలు..
ఈ వేడుకల్లో పాల్గొనే భక్తుల కోసం వివిధ రకాల స్పాన్సర్షిప్ అవకాశాలను అందుబాటులో ఉంచారు. నెల అంతటా జరిగే అన్ని పూజలకు 1,001 డాలర్లు, సత్యనారాయణ వ్రతానికి 101 డాలర్లు, సంకల్పంతో చేసే రుద్రాభిషేకానికి 75 డాలర్లు, పాల అభిషేకానికి 11 డాలర్లు , అర్చనకు 21 డాలర్లుగా నిర్ణయించారు.
ఈ పూజల్లో పాల్గొనాలనుకునే భక్తులు ఆలయ చిరునామా (3555 Lomita Blvd., Unit A, Torrance, CA 90505) వద్దకు చేరుకోవచ్చు. వివరాలకు (310) 561-8082 ఫోన్ నంబర్‌ను లేదా [email protected] ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.
