శాన్ మార్టిన్లోని శ్రీ వల్లభ మహా గణపతి ఆలయం (VVGC) ప్రాంగణంలో ప్రతి శనివారం సాయంత్రం వారంతపు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. భక్తి, శాంతి , ఆధ్యాత్మిక ఆశీస్సులను అందించే ఈ కార్యక్రమంలో సాయంత్రం 6:30 గంటలకు పూజలు ప్రారంభమవుతాయి.
పూజా కార్యక్రమాలు ..
ఈ కార్యక్రమంలో భాగంగా సంకీర్తన, రామ్ ధున్, సముదాయ హనుమాన్ చాలీసా , సంకట్ మోచన్ పారాయణం నిర్వహించనున్నారు. అనంతరం స్వామివారికి హారతి , పుష్పాంజలి సమర్పిస్తారు. పూజలు పూర్తయిన తర్వాత భక్తులందరికీ ప్రీతి భోజ్ (మహాప్రసాదం) వితరణ ఉంటుంది. ఈ పారాయణ కార్యక్రమాన్ని శ్రీనివాస్ సరిపపల్లి , రమ ఆలపించనున్నారు.
వేదిక వివరాలు..
ఈ ఆధ్యాత్మిక పారాయణ కార్యక్రమం శాన్ మార్టిన్లోని మోంటెరే రోడ్డులో ఉన్న శ్రీ వల్లభ మహా గణపతి ఆలయంలో (11355 Monterey Rd, San Martin, CA 95046) ప్రతి శనివారం జరుగుతుంది. సమాజంతో అనుసంధానమవ్వడానికి, పిల్లల్లో ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడానికి భక్తులందరూ తమ కుటుంబసమేతంగా హాజరై భజరంగ్ బలి ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు కోరారు.
