చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అమెరికాలో పర్యతించేందుకు వాషింగ్టన్కు చేరుకున్నారు. ఆయనకు అమెరికా గడ్డపై అత్యంత అరుదైన , ఘనమైన స్వాగతం లభించింది. వాషింగ్టన్ సమీపంలోని జాయింట్ బేస్ ఆండ్రూస్ సైనిక విమానాశ్రయానికి జిన్‌పింగ్ చేరుకోగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఆయనకు సాదర స్వాగతం పలికారు.
ఘన ఆతిథ్యం..
చైనా అధినేత రాక సందర్భంగా విమానాశ్రయంలో సుమారు 100 అడుగుల మేర రెడ్‌కార్పెట్‌ను ఏర్పాటు చేశారు. మిలిటరీ బ్యాండ్ సంగీతం మోగుతుండగా ఇరు దేశాల అధ్యక్షులు పక్కపక్కనే నిలబడ్డారు. ఈ సమయంలో ఆకాశంలో రెండు బి-1 బాంబర్ యుద్ధ విమానాలు గాల్లో విన్యాసాలు చేస్తూ తమ సైనిక శక్తిని ప్రదర్శించాయి. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య దౌత్య, వాణిజ్య సంబంధాలు ఒడుదొడుకులను ఎదుర్కొంటున్న తరుణంలో, ఇరు దేశాల మధ్య సయోధ్య కుదుర్చుకునే దిశగా ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
చంద్రుడి పర్యటన ముఖ్య ఉద్దేశం..
మూడు రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్న జిన్‌పింగ్ గురువారం నాడు ట్రంప్‌తో ద్వైపాక్షిక అధికారిక చర్చల్లో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో కృత్రిమ మేధ వల్ల ముప్పు, వాణిజ్య సవాళ్లు, అంతర్జాతీయ సంబంధాల వంటి పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అమెరికా-చైనా దేశాలు ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా ఉండాలని పర్యటనకు ముందే జిన్‌పింగ్ అభిప్రాయపడ్డారు. కాగా, చైనా అధ్యక్షుడు వెంట ఆయన నమ్మకస్తులు, విదేశాంగ మంత్రి వాంగ్ ఈ తదితరులు ఉన్నారు. వైట్‌హౌస్‌లో జరిగే అధికారిక విందుతో పాటు పలు కార్యక్రమాల్లో జిన్‌పింగ్ దంపతులు పాల్గొననున్నారు.
