శాక్రమెంటో కౌంటీ డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యూమన్ అసిస్టెన్స్ (DHA) , జాబ్లింక్ (JobLink) సంయుక్త ఆధ్వర్యంలో ‘జాబ్ టాక్’ (Job Talk) కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నవంబర్ 24, 2026, మంగళవారం ఉదయం 10:30 AM నుండి 5747 Watt Ave, Sacramento, CA 95660 వేదికగా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. కార్యక్రమంలో పాల్గొనేవారు 10 నిమిషాలు ముందుగా చేరుకోవాలని, స్థల పరిమితుల కారణంగా పిల్లలకు అనుమతి లేదని నిర్వాహకులు తెలిపారు.
ఈ సదస్సులో ప్రస్తుత ఉద్యోగ అవకాశాల గురించిన అవగాహన, దరఖాస్తు , నియామక ప్రక్రియల వివరాలు, రెజ్యూమ్ , ఉద్యోగ అన్వేషణకు సంబంధించిన సహాయం అందించబడతాయి. కవర్డ్ కాలిఫోర్నియా (Covered California), యూసీ డేవిస్ (UC Davis Temporary Employment Services), విజిటింగ్ ఏంజెల్స్ (Visiting Angels) వంటి ప్రముఖ సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయి. దివ్యాంగులు ఎవరైనా ప్రత్యేక వసతి కోరుకుంటే 916-874-5636 నంబర్‌ను సంప్రదించవచ్చు లేదా [email protected] మెయిల్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.
