ITServe Alliance బే ఏరియా ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘‘సినర్జీ 2026’’ సదస్సు నిర్వహిస్తోంది. దీనికి ‘Empowering Local Employment’థీమ్ తో దీనిని అత్యంత వైభవంగా జరిపేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ప్రపంచాన్ని సాంకేతికత ఊపేస్తోంది. మరీ ముఖ్యంగా AI మరింత సంచలనంగా మారింది. దీంతో దీనిపై మరింత అవగాహన కల్పించేందుకు సిద్ధమయ్యారు. ‘రెస్సిలెన్స్ త్రూ ఏఐ’ (Resilience Through AI) ప్రధానాంశంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.
అమెరికాలోని షికాగో నగరంలో ఉన్న రెనేసాన్స్ షాంబర్గ్ కన్వెన్షన్ సెంటర్ హోటల్ వేదికగా అక్టోబర్ 28 నుండి 30, 2026 వరకు ఈ సదస్సు అత్యంత వైభవంగా జరగనుంది. ఈ సదస్సుకు వివిధ రంగాల నుండి ప్రముఖ నాయకులు, నిపుణులు హాజరై నూతన దృక్పథాలను అందించనున్నారు.
ఈ సదస్సులో పాల్గొనే ప్రధాన వక్తలు మరియు నాయకులు:
అమిత్ చద్దా (CEO & మేనేజింగ్ డైరెక్టర్, L&T టెక్నాలజీ సర్వీసెస్)
ఉర్సులా విలియమ్స్ (ప్రెసిడెంట్, స్టాఫింగ్ ఇండస్ట్రీ అనలిస్ట్స్ – SIA గ్లోబల్ స్టాఫింగ్)
నీల్ హోయ్న్ (చీఫ్ స్ట్రాటజిస్ట్, గూగుల్ & AI & గ్రోత్ స్ట్రాటజిస్ట్, బెస్ట్ సెల్లింగ్ ఆథర్)
నిరేన్ చౌదరి (మాజీ చైర్మన్ & CEO – పనేరా బ్రెడ్, మాజీ ప్రెసిడెంట్ & COO – క్రిస్పీ క్రీమ్, మాజీ ప్రెసిడెంట్ – YUM! బ్రాండ్స్)
రాబర్ట్ హెర్జావెక్ (గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్, షార్క్ ట్యాంక్ ఇన్వెస్టర్, సైబర్ సెక్యూరిటీ లీడర్, బెస్ట్ సెల్లింగ్ ఆథర్)
డా. షాడే జహ్రాయ్ (సెల్ఫ్-లీడర్షిప్ ఎడ్యుకేటర్, బిహేవియరల్ ఎక్స్పర్ట్ & రచయిత)
జేసన్ షెన్కర్ (టాప్-ర్యాంక్డ్ ఎకనామిస్ట్, లీడింగ్ ఫ్యూచరిస్ట్, బెస్ట్ సెల్లింగ్ ఆథర్)
సైనా నెహ్వాల్ (ఒలింపిక్ పతక విజేత & మాజీ వరల్డ్ నెం. 1 బ్యాడ్మింటన్ ప్లేయర్)
గెరీస్ అబౌఅయాష్ (మేనేజింగ్ డైరెక్టర్, AWS గ్లోబల్ సేల్స్ నార్త్ అమెరికా ఇండస్ట్రీస్ సొల్యూషన్స్ ఆర్కిటెక్చర్)
డా. పార్దిస్ మహ్దావి (రచయిత, ఆంత్రోపలాజిస్ట్, ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ ఎక్స్పర్ట్, మాజీ యూనివర్సిటీ ప్రెసిడెంట్)
ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ 2026synergy.itserve.org ని సందర్శించవచ్చు.
