ఇండో అమెరికన్ల సంఘం (AIA), అసెంబ్లీ సభ్యులు ఆష్ కల్రా మరియు డాక్టర్ దర్శన్ పటేల్ మరియు ఇతర భాగస్వాములతో కలిసి ఘనంగా దీపావళి వేడుకలను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. సమాజాన్ని ఏకతాటిపైకితెచ్చే ఓ చారిత్రాత్మక వేడుక అయిన ‘‘దీపావళి ఎట్ ది క్యాపిటల్’’ కి అందర్నీ సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
నవంబర్ 5 వ తేదీన, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభం అవుతుందని నిర్వాహకులు తెలిపారు. West Steps of the Capitol వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ దీపాల వెలిగింపు, భారతీయ టిఫిన్స్ కూడా అందుబాటులో వుంచుతున్నామని నిర్వాహకులు ప్రకటించారు. అమెరికా గడ్డపై భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను సమున్నతంగా చాటే ఈ వేడుకకు హాజరై విజయవంతం చేయాల్సిందిగా నిర్వాహకులు అందరికీ ఆహ్వానిస్తున్నారు.
కార్యక్రమ వివరాలు :
తేదీ : నవంబర్ 5
సమయం : మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:00 వరకు
వేదిక : West Steps of the Capitol
