సాన్ బ్రూనోలోని సనాతన మందిరంలో కార్తిక పౌర్ణమి దీప్దాన్ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. విష్ణు దేవ్ ఉత్థాని, దేవ్ దీపావళి వేడుకలను పురస్కరించుకుని ఈ కార్యక్రమం జరగనుంది. కుటుంబ సమేతంగా వచ్చి దీపాలు వెలిగించి ఈ వేడుకలో పాలుపంచుకోవాలని నిర్వాహకులు కోరారు.
ప్రత్యేక కార్యక్రమాలు..
తేదీ , సమయం: నవంబర్ 14, 2026, శనివారం సాయంత్రం 5:00 గంటల నుండి ఈ వేడుకలు ప్రారంభమవుతాయి.
ప్రత్యేక ఆకర్షణలు..
రేవా కుమార్ అందించే ఆధ్యాత్మిక కథలు, లైవ్ భజనలు, నృత్య ప్రదర్శనలు, , అందమైన దీపదాన్ వేడుక నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ప్రవేశం పూర్తిగా ఉచితం కాగా, హాజరయ్యే భక్తులకు దీపదాన్ కిట్‌ను కూడా ఉచితంగా అందజేస్తారు. కార్యక్రమం ముగిసిన తర్వాత భక్తులందరి కోసం మహాప్రసాద భోజనాన్ని ఏర్పాటు చేశారు.
వేదిక చిరునామా..
సనాతన మందిర్, 205 ఆంగస్ ఏవెంన్ డబ్ల్యూ, సాన్ బ్రూనో. ఈ వేడుక విజయవంతం కావడానికి సఖి సహేలి గ్రూప్, లిటిల్ ఇండియా రెస్టారెంట్ లివర్మోర్, పలువురు సామాజిక కార్యకర్తలు, కళాకారులు , సనాతన మందిర్ మేనేజ్మెంట్ బృందం సహకరిస్తున్నాయి.
