కాలిఫోర్నియాలోని టోరెన్స్‌లో గల శ్రీ పంచముఖ హనుమాన్ ఆలయ వేదికగా ‘వల్లేమ్ వారి ఫార్మ్స్’ (VVF) ఆధ్వర్యంలో అలంకరణ , పండ్ల మొక్కల విక్రయ (Plant Sale) కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నవంబర్ 14, 2026, శనివారం ఉదయం 10:00 AM నుండి సాయంత్రం 4:00 PM వరకు 23805 Hawthorne Blvd, Torrance, CA లోని శ్రీ పంచముఖ హనుమాన్ ఆలయంలో ఈ వేడుక జరగనుంది.
ఈ విక్రయాల్లో తులసి, గోరింటాకు, జాస్మిన్ రకాలు (బెల్లె ఆఫ్ ఇండియా, గ్రాండ్ డ్యూక్ మొదలైనవి), మందారం, పన్నీర్ రోజ్, దొండ, వేప, ఉసిరి, రేగు, మామిడి రకాలు (పికిరింగ్, ఫ్రూట్ పంచ్, కేసర్ మొదలైనవి), థాయ్ జామ, చెరిమోయా , సీతాఫలం వంటి పలు రకాల మొక్కలు అందుబాటులో ఉంటాయి. అలాగే ఈ ప్లాంట్ సేల్కు సహకరించడానికి వాలంటీర్లను ఆహ్వానిస్తున్నామని, వాలంటీర్లకు VVF తరఫున $100 వోచర్లు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాల కోసం +1 (848) 244-0213 నంబర్‌ను సంప్రదించవచ్చు.
