కాలిఫోర్నియాలోని నొవాటోలో గల ‘అనుభూతి మెడిటేషన్ అండ్ రిట్రీట్ సెంటర్’ (The Brahma Kumaris – Anubhuti Meditation and Retreat Center) ఆధ్వర్యంలో ట్రాన్స్ఫార్మింగ్ స్ట్రెస్ ఇన్‌టూ సక్సెస్(Transforming Stress into Success) పేరుతో ఒక రోజు ప్రత్యేక ధ్యాన శిబిరాన్ని నిర్వహించనున్నారు. నవంబర్ 21, 2026 రోజున ఉదయం 10 AM నుండి సాయంత్రం 5 PM వరకు 820 Bel Marin Keys Blvd, Novato, CA 94949 వేదికగా ఈ ఇన్-పర్సన్ డే రిట్రీట్ జరగనుంది.
ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఎలిజబెత్ పడిల్లా(Elizabeth Padilla), వినోద్ ముంగల్పారా (Vinod Mungalpara) ఫెసిలిటేటర్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఒత్తిడికి అసలు కారణాలను అర్థం చేసుకోవడం, ప్రతికూల ఆలోచనలను సానుకూల దృక్పథంగా మార్చడం, ప్రశాంతతతో స్పందించడం, స్వీయ-అవగాహన పెంపొందించుకోవడానికి ధ్యానం చేయడం వంటి అంశాలపై ఈ శిబిరంలో అవగాహన కల్పిస్తారు. రిజిస్ట్రేషన్ , వివరాల కోసం anubhutiretreatcenter.org వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా 415-884-2314 నంబర్‌ను సంప్రదించవచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారికి శాఖాహార భోజనం కూడా అందిస్తారు.
