టాలీవుడ్ సీనియర్ అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున తమ పాత శైలికి భిన్నంగా పూర్తి మేకోవర్‌తో ముందుకు వస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా ట్రెండీ అవుట్‌ఫిట్స్, డిఫరెంట్ హెయిర్‌స్టైల్స్, ప్రత్యేక బాడీ లాంగ్వేజ్‌తో సరికొత్త ఎనర్జీని ప్రదర్శిస్తున్నారు. ఇటీవల విడుదలైన మెగాస్టార్ ‘కాకా’, బాలయ్య ‘దాదా’, నాగ్ ‘కింగ్ 100’, వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’ టీజర్లు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటూ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
యంగ్ డైరెక్టర్ల టేకింగ్ ..
ఈ సీనియర్ హీరోలందరూ ఈతరం యువ దర్శకుల ఆలోచనలకు తగ్గట్టు తమని తాము మలుచుకున్నారు. రొటీన్ మాస్ ఫార్ములాకు గుడ్‌బై చెప్పి, మోడర్న్ కలర్ ప్యాలెట్, సరికొత్త లైటింగ్ , స్టైలిష్ కెమెరా వర్క్‌తో ఈ టీజర్లను మేకర్స్ విజువల్ వండర్‌గా తీర్చిదిద్దారు. నేటి తరం సంగీత దర్శకులు అందించిన అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (బీజీఎమ్) ప్రతి సీన్‌ను వేరే లెవెల్‌కి తీసుకెళ్లింది. ముఖ్యంగా ‘కాకా’, ‘దాదా’ టీజర్లలోని ఎలివేషన్ సీన్లు థియేటర్లలో విజిళ్లు వేయించేలా ఉన్నాయి.
విభిన్నమైన షాట్స్ ..
విజువల్స్ పరంగా నలుగురి ప్రెజెంటేషన్ ఒకదాన్ని మించి ఒకటి నిలిచింది. నాగ్ ‘కింగ్ 100’లోని మోడర్న్ స్వైగ్, వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’లోని ఎమోషనల్ అండ్ క్లాసీ షాట్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ఏ టీజర్ చూసినా ఒక భారీ విజువల్ ఫీస్ట్‌లా అనిపిస్తోందని సినీ వర్గాలు ప్రశంసిస్తున్నాయి.
విడుదల తేదీలు..
ఈ నాలుగు సినిమాలు రాబోయే పండుగ సీజన్లను టార్గెట్ చేస్తూ బాక్సాఫీస్ వద్ద పోటీకి సిద్ధమవుతున్నాయి. వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ 2న విడుదల కానుంది. బాలయ్య ‘దాదా’, నాగార్జున ‘కింగ్ 100’ చిత్రాలు డిసెంబర్ 24న బాక్సాఫీస్ వద్ద పోటీపడబోతున్నాయి. మెగాస్టార్ ‘కాకా’ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది.
రొటీన్ మూస ధోరణిని పక్కనపెట్టి, యంగ్ ట్రెండ్‌కు తగ్గట్టు రీ-బ్రాండ్ అయిన మన సీనియర్ హీరోల ఈ సరికొత్త ప్రయోగాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయో వేచి చూడాలి.
