అమెరికాలో నివసించే ప్రవాస భారతీయల సౌలభ్యం కోసం శాన్ ఫ్రాన్సిస్కోలోని భారతీయ రాయబార కార్యాలయం (Consulate General of India) ప్రత్యేకంగా ‘కాన్సులర్ క్యాంప్ అండ్ ఓపెన్ హౌస్’ను నిర్వహిస్తోంది. “కాన్సులేట్ @ యువర్ డోర్స్టెప్” (Consulate@YourDoorstep) కార్యక్రమంలో భాగంగా, ఇండియన్ కల్చరల్ సెంటర్ (ICC) ఆఫ్ యూటా సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
క్యాంప్ తేదీ వివరాలు..
తేదీ: నవంబర్ 9, 2026 (సోమవారం)
సమయం: ఉదయం 10:00 AM నుండి మధ్యాహ్నం 4:00 PM వరకు
వేదిక: ఇండియా కల్చరల్ సెంటర్ (ICC), 1142 W సౌత్ జోర్డాన్ పార్క్వే, సౌత్ జోర్డాన్, యూటా – 84095
క్యాంపులో లభించే సేవలు..
ఈ ప్రత్యేక సేవా శిబిరంలో స్థానిక భారతీయుల కోసం పలు రకాల కాన్సులర్ సేవలను అందించనున్నారు.
పాస్పోర్ట్ సేవలు
ఓసీఐ (OCI) కార్డ్ సేవలు
రెన్యుయేషన్ (Renunciation)
వీసా సేవలు
పవర్ ఆఫ్ అటార్నీ (Power of Attorney)
లైఫ్ సర్టిఫికెట్ జారీ తదితర సేవలు అందుబాటులో ఉంటాయి.
దరఖాస్తుదారులు పాటించాల్సినవి..
పాస్పోర్ట్, OCI, వీసా సేవల కోసం దరఖాస్తుదారులు ముందుగా అధికారిక VFS గ్లోబల్ వెబ్సైట్ (https://services.vfsglobal.com/usa/en/ind/news/consular-camp-utah) ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి.
దరఖాస్తుదారులు తమ ఆన్లైన్ అప్లికేషన్ ప్రింటవుట్, పేమెంట్ రశీదు , VFS వెబ్సైట్లోని చెక్లిస్ట్ ప్రకారం అన్ని అవసరమైన డాక్యుమెంట్ల కాపీలను విధిగా వెంట తీసుకెళ్లాలి.
దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించడానికి కాన్సులేట్ , VFS అధికారులు నేరుగా అక్కడే అందుబాటులో ఉంటారు.
