అమెరికాలోని ప్లీసంటన్ అలమేడా కౌంటీ ఫెయిర్‌గ్రౌండ్స్‌లో అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA), బొల్లీ 92.3 ఎఫ్ఎం ఆధ్వర్యంలో దసరా దీపావళి ధమాకా (DDD) 2026 వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. కాంతి, సంస్కృతి, సామాజిక స్ఫూర్తి సంగమంగా సాగిన ఈ వేడుకలకు దాదాపు 25 వేలకు పైగా ఎన్నారైలు హాజరయ్యారు. ఇది దేశంలోనే అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన వేడుకలలో ఒకటిగా నిలిచింది.
శాంతి, సమృద్ధి కోరుతూ నిర్వహించిన పవిత్ర మహా మంగళ హారతితో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం నిర్వహించిన అద్భుతమైన “దుర్గామా” రథయాత్ర భక్తిశ్రద్ధలు, సంగీతం, సాంస్కృతిక వైభవంతో ప్రాంగణాన్ని నింపింది. రామాయణ గాథ ఆధారంగా ప్రదర్శించిన రామ్‌లీలా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ వేడుకల్లో భాగంగా అద్భుతంగా నిర్మించిన 40 అడుగుల భారీ రావణాసురుడి దిష్టిబొమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేల సంఖ్యలో ప్రజల సమక్షంలో ఈ దిష్టిబొమ్మను దహనం చేయగా, చెడుపై మంచి సాధించిన శాశ్వత విజయానికి ఇది ప్రతీకగా నిలిచింది. ఈ ఉత్సాహం ముగింపు ఘట్టమైన అద్భుతమైన బాణసంచా ప్రదర్శనతో మరింత ఉప్పొంగింది. లయబద్ధమైన సంగీతానికి తగ్గట్టుగా ఆకాశంలో బంగారు, ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగుల బాణసంచా వర్షం కురిపించింది. చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా ఈ బాణసంచా ప్రదర్శన నిలిచింది.
ఈ వేడుకల్లో 500 మందికి పైగా ప్రతిభావంతులైన కళాకారులు ఇండోర్, అవుట్డోర్ స్టేజీలపై ప్రదర్శనలు ఇచ్చారు. శాస్త్రీయ, జానపద, బాలీవుడ్, ఫ్యూషన్ ప్రదర్శనలు భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటిచెప్పాయి. ఏఐఏ ఐడల్ సింగింగ్ పోటీలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే 135కి పైగా వెండర్ స్టాళ్లు, 25 ఫుడ్ స్టాళ్లు ఏర్పాటు చేశారు. వీటిలో రుచికరమైన భారతీయ వంటకాలు, పండుగ మిఠాయిలు, సాంస్కృతిక వస్త్రాలు, ఆభరణాలు, హస్తకళలు, దీపావళి అలంకరణ వస్తువులు, ఫైనాన్షియల్, ట్యాక్స్, ఎడ్యుకేషనల్ రంగానికి సంబంధించిన స్టాళ్లు సందర్శకులను ఆకట్టుకున్నాయి.

పండుగ వెలుగుల నడుమ వేలాది మంది కలిసి గర్భా, దాండియా నృత్యాలతో ఉత్సాహంగా గడిపారు. ఇవి ఐక్యతను, ఆనందాన్ని ప్రతిబింబించాయి. వీటితో పాటు సిందూర కేళ, ధునుచి నాచ్, హనుమాన్ చాలీసా పఠనం, మహా ఖోజ్ ట్రెజర్ హంట్, కార్నివాల్ రైడ్స్, చెస్ పోటీలు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి.
ప్రవాసుల సాంస్కృతిక, పౌర ప్రభావాన్ని ప్రతిబింబించేలా ఈ వేడుకలకు కాన్సుల్ జనరల్ సతీష్ శివన్, అసెంబ్లీ సభ్యులు ఒర్టెగా ప్రతినిధి, శాన్ రామన్ మేయర్ మార్క్ ఆర్మ్‌స్ట్రాంగ్, డబ్లిన్ మేయర్ షెర్రీ హు, ప్లీసంటన్ మేయర్ జాక్ బాల్చ్, ఫ్రీమాంట్ మేయర్ రాజ్ సల్వాన్, శాన్ రామన్ కౌన్సిల్ సభ్యులు శ్రీధర్ వెరోస్, శాన్ రామన్ వైస్ మేయర్ మారిసోల్, బార్ట్ బోర్డ్ ప్రెసిడెంట్ మెలిస్సా హెర్నాండెజ్, ప్లీసంటన్ కౌన్సిల్ సభ్యులు జూలీ టెస్టా తదితరులు ప్రముఖులుగా విచ్చేశారు.
ఈ వేడుకలను విజయవంతం చేయడానికి సహకరించిన స్పాన్సర్లు డేవిడ్ హౌబర్ట్, సంజీవ్ గుప్తా సీపీఏ (ఫైర్వర్క్స్ స్పాన్సర్), డాక్టర్ ప్రకాష్, రియల్టర్ లావణ్య దువ్వి, ట్రావెలోపాడ్, రియల్టర్ నాగరాజ్ అన్నయ్య & లైఫాలజీ (ఎడ్యుకేషనల్ పార్ట్నర్), జూమ్ ఎ పేపాల్ సర్వీస్ (డైమండ్ స్పాన్సర్), గోపి డైరీ (పవర్డ్ బై) లకు ఏఐఏ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. అలాగే సిరియా పసిఫిక్ ప్రైవేట్ వెల్త్, ఇన్‌స్టా సర్వీస్, మై పర్సు, వాచి సిల్క్స్, విజయ్ సూపర్‌మార్కెట్, కావ్య ఫుడ్స్, అపెక్స్ కన్సల్టింగ్, శాష్ట ఫ్రెష్(Shasta Fresh), ఆజాద్ ఫైనాన్షియల్స్, మలబార్ జ్యువెలర్స్ , జీహెచ్ ప్యాక్‌వెస్ట్ ఫౌండేషన్ ఇతర స్పాన్సర్లుగా వ్యవహరించాయి.
మీడియా పార్ట్నర్లుగా తెలుగు టైమ్స్ సహా తదితర సంస్థలు సహకరించాయి. కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులు, వెండర్లు, 100 మందికి పైగా వాలంటీర్ల అంకితభావం వల్లే ఈ భారీ వేడుక విజయవంతమైందని ఏఐఏ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.

