బే ఏరియాలోని శ్రీ కృష్ణ వృందావన టెంపుల్ సాన్ జోస్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు, లక్ష్మీ పూజ నిర్వహిస్తున్నారు. నవంబర్ 8 వ తేదీన సాయంత్రం 6:00 గంటల నుంచి ఈ వేడుకలు ప్రారంభం అవుతాయని దేవాలయ నిర్వాహకులు ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు.
భారతీయులకు దీపావళి వేడుకలు, లక్ష్మీ పూజలు ఎంతో ప్రశస్తమైనవని, అందరూ లక్ష్మీ కటాక్షం పొందడానికి తాము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అందరూ కలిసి దీపావళి, లక్ష్మీపూజ వేడుకలు చేసుకొందామని, తమతో అందరూ కలిసి రావాలని సాదరంగా దేవస్థానం ఆహ్వానం పలుకుతోంది. ఈ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొని, లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కావాలని పిలుపునిస్తోంది.
కార్యక్రమ వివరాలు :
తేదీ : నవంబర్ 8
సమయం : సాయంత్రం 6:00 గంటల నుంచి
వేదిక : శ్రీ కృష్ణ వృందావన టెంపుల్, సాన్ జోస్
