అమెరికాలోని కాలిఫోర్నియా, రివర్‌సైడ్‌లో గల శ్రీ లక్ష్మీ నారాయణ మందిరంలో (Hindu Society of Inland Empire) అత్యంత వైభవంగా ‘కార్తీకై వాహన ఉత్సవం’ (Karthikai Vahanam Utsavam) నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా నవంబర్ 14, 2026 శనివారం రోజున ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ‘శ్రీ రిషబరుద్ర శివ పార్వతి పరిక్రమ’ కార్యక్రమం జరగనుంది.
భక్తులు నీరాంజనం ($21 – కొబ్బరి నెయ్యి దీపం) సమర్పించి స్వామివారి కృపను పొందవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ పవిత్ర కార్యక్రమంలో శివ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నారు. మరింత సమాచారం కోసం [email protected] ఇమెయిల్ ద్వారా లేదా (951)-312-7352 నంబర్‌ను సంప్రదించవచ్చు.
